దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) తొలి సెమీఫైనల్లో ఇవాళ ఇండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా రెండు మార్పులు చేసింది. ఇద్దరు ఆ జట్టులోకి వచ్చేశారు. మాథ్యూ షార్ట్ స్థానంలో కూపర్ కానల్లీ, స్పెన్షర్ జాన్సన్ స్థానంలో తన్వీర్ సంఘాలు వచ్చారు. రోహిత్ సేన మార్పు లేకుండా బరిలోకి దిగుతున్నది. గ్రూపు స్టేజ్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన జట్టే.. సెమీస్‌లోనూ ఆడుతున్నది.
🚨 Toss News 🚨
Australia have elected to bat against #TeamIndia in the #ChampionsTrophy Semi-Final!
Updates ▶️ https://t.co/HYAJl7biEo#INDvAUS pic.twitter.com/tdkzvwJfyu
— BCCI (@BCCI) March 4, 2025
ఒకవేళ టాస్ గెలిస్తే, బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రోహిత్ శర్మ తెలిపాడు. వికెట్ చాలా భిన్నంగా ఉందన్నాడు. గందరగోళంలో ఉన్నపుడు.. టాస్ ఓడిపోవడమే బెటర్ అని పేర్కొన్నాడు. ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడామని, మూడుసార్లు చాలా భిన్నంగా పిచ్ ఉన్నట్లు గ్రహించామన్నాడు. పిచ్ ఎప్పటికప్పుడు మారుతున్నట్లు చెప్పాడు. స్లో బౌలర్లు ఎక్కువగా రాణిస్తున్నట్లు తెలిపాడు. అందుకే జట్టులో ఎటువంటి మార్పులు చేయడం లేదన్నాడు.
వన్డేల్లో ఇండియా వరుసగా 14వ సారి టాస్ ఓడిపోయింది. భారత జట్టు నలుగురు స్పిన్నర్లతో ఆడుతోంది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్.. స్పిన్నర్ల జాబితాలో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా కూడా రెండు భారీ మార్పులు చేసింది. ఆడమ్ జంపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్‌తో పాటు కూపర్ కానల్లే, తన్వీర్ సంఘా స్పిన్ బౌలర్ పాత్ర పోషించనున్నారు.