టోక్యో: ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా వుమెన్స్ ఫ్రీస్టైల్ రిలే స్విమ్మింగ్ టీమ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. 4×100 మీటర్ల రిలే టీమ్.. వాళ్ల రికార్డునే అధిగమించడం విశేషం. ఈ ఈవెంట్లో ఆస్ట్రేలియాకు గోల్డ్ మెడల్ రావడం ముందే ఖాయమైనా.. చివరికి సొంత రికార్డును కూడా బద్ధలుకొట్టి ఆ టీమ్ గెలిచింది. ఇంతకుముందు జరిగిన రెండు ఒలింపిక్ గేమ్స్‌లోనూ ఆస్ట్రేలియా ఖాతాలోనే రెండు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి.
2018లో తాము క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డును ఇప్పుడు అధిగమించింది. బ్రాంట్ క్యాంప్‌బెల్, మెగ్ హ్యారిస్ తొలి రెండు లెగ్స్‌లో మంచి స్టార్ట్ ఇవ్వగా.. మూడో లెగ్‌లో ఎమ్మా మెక్కియోన్ రికార్డు స్విమ్ ఆస్ట్రేలియాకు ఈ రికార్డు కట్టబెట్టింది. చివరి లెగ్‌లో కేట్ క్యాంప్‌బెల్ కూడా అదే స్పీడు కొనసాగించడంతో ఈ రిలేను 3:29.69 నిమిషాల్లో ఆస్ట్రేలియా టీమ్ పూర్తి చేసి కొత్త రికార్డును నెలకొల్పింది.