T20 World Cup | షార్జా: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సెమీస్ రేసులో నిలవాలంటే భారీ తేడాతో తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు చేతులెత్తేసింది. ఆదివారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను 9 పరుగుల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా సెమీస్‌కు ప్రవేశించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 20 ఓవర్లలో 151/8 పరుగులు చేసింది. గ్రేస్ హారీస్ (40), ఎల్లీస్ పెర్రీ (32) రాణించారు. ఛేదనలో హర్మన్‌ప్రీత్ కౌర్ (54 నాటౌట్) అర్ధ సెంచరీతో పోరాడినా 20 ఓవర్లలో భారత్ 142/9 వద్దే ఆగిపోయింది. నేడు న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఫలితంపై భారత్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కివీస్ ఓడిపోతేనే మన అమ్మాయిలకు సెమీస్ చేరడానికి అవకాశముంటుంది.