Womens T20 WC : దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన మహిళల టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా అవతరించింది. ఆరోసారి పొట్టి ప్రపంచకప్ ఎగరేసుకుపోయింది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాపై 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా లారా వొల్వార్డ్ (61) ప్లేయర్ పోరాడిన మ్యాచ్ గెలిపించలేకపోయింది. సాధించాల్సిన రన్ రేటు 12పైనే ఉండడంతో దక్షిణాఫ్రికా ప్లేయర్స్ ఒత్తిడికి లోనయ్యారు. ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 రన్స్‌కే పరిమితం అయింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 156 రన్స్ స్కోర్ చేసింది. బేత్ మూనీ అర్థ సెంచరీ (74 నాటౌట్)తో చెలరేగడంతో ఆసీస్ 150 ప్లస్ స్కోర్ చేయగలింది. దాంతో, 6 వికెట్ల నష్టానికి ఆ జట్టు పోరాడగలిగే పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజాన్నే కాప్, షబ్నిం ఇస్మాయిల్ రెండు వికెట్లు తీశారు. నన్కులులెకో లబా, ట్రయాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. 19వ ఓవర్లో షబ్నిం ఇస్మాయిల్ రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్‌పై నిలిచింది. అయితే, చివరి బంతికి ఒక్క రన్ రావడంతో హ్రాట్రిక్ మిస్ అయింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన బేత్ మూన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలవాలి అనుకున్న దక్షిణాఫ్రికాకు నిరాశే మిగిలిందే. మొదటిసారి పొట్టి ప్రపంచకప్ ఫైనల్ చేరిన సఫారీ జట్టు ట్రోఫీని ముద్దాడలేకపోయింది. పురుషుల జట్టు మాదిరిగానే మహిళల జట్టు కూడా ఒత్తిడిని తట్టుకోలేక పోయింది. 157 టార్గెట్ ఛేదనలో 17 పరుగుల వద్ద సఫారీ టీమ్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ (10) స్వల్ప స్కోర్‌కే ఔట్ అయింది. 42 రన్స్ వద్ద మరిజానే కాప్ (11) రెండో వికెట్‌గా వెనుదిరిగింది. కెప్టెన్ సునే లుస్ (2) రనౌట్ కావడంతో ఆ జట్టు ఒత్తిడిలో పడింది.
అయితే.. లారా వొల్వార్డ్, చ్లో ట్రయాన్తో కలిసి స్కోర్ బోర్డు వంద దాటించింది. నాలుగో వికెట్‌కు ఈ జోడీ 50 పరుగులు చేసింది. అయితే.. మేగన్ షట్ వేసిన 17వ ఓవర్లో లారా వొల్వార్డ్ ఎల్బీగా ఔట్ కావడంతో మ్యాచ్ ఆసీస్ వైపు తిరిగింది. 48 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 రన్స్ చేసింది. అప్పటికి సాధించాల్సిన రన్‌రేటు 14 పైనే ఉంది. ట్రయాన్ (25) 17.4వ ఓవర్లో బౌల్డ్ అయింది. దాంతో, దక్షిణాఫ్రికా గుండె పగిలింది. ఎందుకంటే అప్పటికే ఆ జట్టు ఓటమి దాదాపు ఖరారైంది.
ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆరోసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. మొదటిసారి ఆ జట్టు 2010లో టీ20 ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత 2012, 2014లో వరల్డ్ కప్ గెలిచింది. దాంతో వరుసగా మూడు సార్లు ఛాంపియన్ అయిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. 2018, 2020, 2023లో కూడా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఛాంపియన్‌గా అవతరించింది.