టీ20 ప్రపంచకప్‌లో మరో సమరానికి రంగం సిద్ధమైంది. దుబాయ్ స్టేడియంలో ఇవాళ శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య పోరు జరగనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. కొద్దిసేపట్లో శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య పోరు ప్రారంభం కానుంది.
ఇక.. ఆస్ట్రేలియా నుంచి అదే టీమ్ బరిలోకి దిగనుంది. డేవిడ్ వార్నర్, ఆరూన్ ఫించ్(కెప్టెన్), మిట్చెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వాడే(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిట్చెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు.
శ్రీలంకలో ఒకే ఒక మార్పు చోటు చేసుకుంది. బినురా ఫెర్నాండో బదులు మహీశ్ తీక్షణను ఈ మ్యాచ్‌కు తీసుకున్నారు. శ్రీలంక జట్టులో కుసల్ పెరీరా(వికెట్ కీపర్), పాతమ్ నిస్సాంక, చరిత్ అసలంక, అవిష్కా ఫెర్నాండో, వానిందు హసరంగా, భానుక రాజపక్సా, డాసన్ షనక(కెప్టెన్), చమిక కరుణారాట్నే, దుష్మంత చమీరా, లాహిరు కుమారా, మహీశ్ తీక్షణ ఈ మ్యాచ్‌లో అడనున్నారు.
Australia skipper Aaron Finch has won the toss and elected to field 🏏
— ICC (@ICC) October 28, 2021
🇦🇺 or 🇱🇰, who's winning this one? #T20WorldCup | #AUSvSL | https://t.co/z8iJEnIOdP pic.twitter.com/EOtTSBsbDA