మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ వేడ్(Matthew Wade).. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 2021 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడతను. అయితే ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించాడు. కానీ కోచింగ్ బాధ్యతలను తీసుకోనున్నట్లు చెప్పాడు. 36 ఏళ్ల మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియా తరపున 36 టెస్టులు, 97 వన్డేలు, 92 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
టాస్మానియా, బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ తరపున దేశవాళీ క్రికెట్లో ఆడనున్నాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో మాథ్యూ వేడ్ చివరిసారి ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. కోచింగ్ గురించి చాన్నాళ్లుగా ఆలోచిస్తున్నట్లు వేడ్ తెలిపాడు. క్రికెట్ ఆస్ట్రేలియా తన ఎక్స్ అకౌంట్లో వేడ్ రిటైర్మెంట్ ప్రకటన రిలీజ్ చేసింది.
36 Test matches. 97 ODIs. 92 T20 Internationals.
Congratulations to Matthew Wade on an outstanding international cricket career! pic.twitter.com/SDWl1OhqZC
— Cricket Australia (@CricketAus) October 29, 2024