గాలె(శ్రీలంక): శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టుపై పర్యాటక ఆస్ట్రేలియా పట్టు బిగించింది. కుహెమన్(4/52), లియాన్ (3/80) ధాటికి లంక రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 211 స్కోరు చేసింది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ఆసీస్ బౌలర్లు వికెట్ల వేట కొనసాగించారు. మాథ్యూస్(76) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. చేతిలో రెండు వికెట్లు ఉన్న లంక ప్రస్తుతం 54 ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఓవర్‌నైట్ స్కోరు 330/3 శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్ 414 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్లు అలెక్స్ క్యారీ(156), కెప్టెన్ స్మిత్(131) దూకుడు కనబరిచారు. ప్రభాత్ జయసూర్య(5/151) ఐదు వికెట్లతో అదరగొట్టగా, నిశాన్ పెరిస్(3/94) ఆకట్టుకున్నారు.