India VS Australia ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్ చేజిక్కించుకున్న(Team India) టీమ్ఇండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో నెగ్గి ఊపుమీదున్న భారత్.. ఆదివారం వైజాగ్(Vishakapatnam)లో ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడనుంది. బామ్మార్ది పెళ్లి వల్ల తొలి మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) రెండో వన్డేలో మళ్లీ కెప్టెన్సీ బాధ్యతల్ని చేపట్టాడు. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకున్నది.
ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ (Steve Smith) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ రాకతో ఇషాన్ తప్పుకోగా.. గిల్‌తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేయనున్నాడు. విరాట్ (Virat Kohli) మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఇక రాహుల్, పాండ్యా, జడేజాతో మిడిలార్డర్ బలంగా కనిపిస్తున్నది. సిరాజ్‌తో కలిసి షమీ పేస్ భారాన్ని మోయనుండగా.. స్పిన్నర్లుగా కుల్దీప్, అక్షర్ పటేల్ లు చోటు దక్కించుకున్నారు.
🚨 Here’s #TeamIndia‘s Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/dzoJxTOHiK#INDvAUS | @mastercardindia pic.twitter.com/UiyxF37ZH6
— BCCI (@BCCI) March 19, 2023