అడిలైడ్ : పింక్ బాల్ టెస్టు(AUSvIND)లో.. ఫస్ట్ డే ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది. పెర్త్ టెస్టులో దారుణంగా ఓడిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టు తొలి రోజు మాత్రం అద్భతమైన ఆటను ప్రదర్శించింది. ఇండియాను 180కి ఆలౌట్ చేసిన ఆసీస్.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 86 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా ఇంకా 96 రన్స్ వెనుకబడి ఉంది. ఆసీస్ బ్యాటర్లలో ఖాజా ఔటయ్యాడు. నాథన్ మెక్‌స్వీనే 38, లబుషేన్ 20 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇద్దరు బ్యాటర్లు భారత బౌలర్లను మెరుగ్గా ఎదుర్కొన్నారు. క్రీజ్‌లో నిలదొక్కునేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. చాలా ఓపికగా స్కోరింగ్ చేశారు.
Nathan McSweeney and Marnus Labuschagne held fort for Australia, slashing almost half the deficit in the final session 👏 #WTC25 | 📝 #AUSvIND: https://t.co/fq7nnvPgWw pic.twitter.com/69vexV17Tx
— ICC (@ICC) December 6, 2024
అడిలైడ్ స్టేడియంలో ఇవాళ రెండు సార్లు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని క్షణాల పాటు మ్యాచ్‌ను నిలిపివేశారు. రేపు మధ్యాహ్నం ఆస్ట్రేలియా ఓ నాలుగు గంటల పాటు సహజమైన వెలుతురులో బ్యాటింగ్ చేయనున్నది. అయితే ఇవాళ ఆసీస్ బ్యాటర్లు బుమ్రా గండాన్ని తప్పించుకున్నారు. వెరైటీ బంతులతో బుమ్రా చెలరేగినా.. ఆసీస్ బ్యాటర్లు మాత్రం సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఉదయం ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ చాన్నాళ్ల తర్వాత రెచ్చిపోయాడు. ఇండియన్ బ్యాటర్లను తన స్వింగ్ యాక్షన్‌తో సతాయించాడు. ఆరు వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.