Australia | మెల్బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌లో భారత్‌తో మిగిలిన రెండు టెస్టుల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) శుక్రవారం జట్టును ఎంపిక చేసింది. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న నాథన్ మెక్‌స్వీనిని తప్పిస్తూ యువ సంచలనం సామ్ కాన్స్టస్కు ఆసీస్ జట్టులో చోటు కల్పించింది. ఒక వేళ టీమ్ఇండియాతో బాక్సింగ్ డే టెస్టులో సామ్‌కు తుది జట్టులో చోటు లభిస్తే..ఆసీస్ తరఫున గత 70 ఏండ్లలో అరంగేట్రం చేయనున్న పిన్న వయసు బ్యాటర్‌గా నిలుస్తాడు.
1953లో ఇయాన్ క్రేగ్(17 ఏండ్ల 239రోజులు) తర్వాత సామ్ ఈ ఘనత అందుకోనున్నాడు. దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో కొన్సాస్.. న్యూసౌత్ వేల్స్ తరఫున నిలకడగా రాణించాడు. సామ్‌తో పాటు జే రిచర్డ్సన్, బ్యూ వెబ్‌స్టర్, బోలాండ్ జట్టులో చోటు దక్కించుకున్నారు.