సిడ్నీ : మరికొద్దిరోజుల్లో సొంతగడ్డపై భారత్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా క్రికెట్ ఆస్ట్రేలియా తొలి టెస్టుకు జట్టును ప్రకటించింది. ఈనెల 22 నుంచి పెర్త్ వేదికగా జరుగబోయే టెస్టులో యువ ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనేకు చోటు దక్కింది. గడిచిన ఏడాదిన్నర కాలంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ఈ కుర్రాడు.. పెర్త్ టెస్టులో ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ ఆ రంభించే అవకాశముంది. మెక్స్వీనేతో పాటు వికెట్ కీపర్ బ్యా టర్ జోష్ ఇంగ్లిస్ కూడా జట్టులోకి వచ్చాడు. 13 మందితో కూ డిన ఈ జట్టుకు పాట్ కమిన్స్ సారథిగా వ్యవహరించనున్నాడు.
తొలి టెస్టుకు ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొ లాండ్, అలెక్స్ కేరీ, జోష్ హెజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జో ష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, లబూషేన్, నాథన్ లి యాన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్