పాకిస్థాన్ పర్యటనకు ఆస్ట్రేలియా

మెల్బోర్న్: యాషెస్ సిరీస్‌ను 4-0తో పట్టేసిన ఆస్ట్రేలియా విజయోత్సాహంతో పాకిస్థాన్ పర్యటనకు సిద్ధమవుతున్నది. భద్రతాపరంగా ఏ ఆటగాడు అభ్యంతరం చెప్పకపోవడంతో ఆస్ట్రేలియా పూర్తిస్థాయి బృందంతో పాక్‌లో అడుగుపెట్టనుంది. 1998లో చివరిసారిగా పాక్‌లో పర్యటించిన ఆసీస్ బృందం దాదాపు 24 ఏండ్ల తర్వాత ఆ గడ్డపై అడుగుపెడుతున్నది. 2009లో శ్రీలంక క్రికెట్ బృందం బస్సుపై ఉగ్రదాడి అనంతరం పాక్ పర్యటనకు కంగారూలు వెనుకాడారు. అప్పటి నుంచి దాయాది దేశంలో పర్యటనపై ఆసీస్ వెనుకంజ వేస్తూనే ఉన్నది. ఈ క్రమంలోనే గతేడాది న్యూజిలాండ్, ఇంగ్లండ్ కూడా పాక్ పర్యటనకు చివరి నిమిషంలో వెనుకడుగు వేశాయి. అయితే ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా సుదీర్ఘ కాలం తర్వాత ఆస్ట్రేలియా పాక్ పర్యటనకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఇరు జట్ల మధ్య మార్చి 3 నుంచి టెస్టు, వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 3 టెస్టులు, మూడు వన్డేలు, ఏకైక టీ20 ఆడేందుకు ఫిబ్రవరి ఆఖరున ఆసీస్ ఆటగాళ్లు పాక్ చేరనున్నారు. మార్చి 3 నుంచి 7 వరకు కరాచీ వేదికగా తొలి టెస్టు, రావల్పిండి (12-16)లో రెండో టెస్టు, లాహోర్ (21-25)లో ఆఖరి టెస్టు, లాహోర్ వేదికగా వన్డే సిరీస్ (మార్చి 29, 31, ఏప్రిల్ 2), ఏకైక టీ20 (ఏప్రిల్ 5) జరుగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

