టీ20 ప్రపంచకప్‌లోనే ఇది ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఎందుకంటే.. రెండు బెస్ట్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఇది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చాలా తక్కువ స్కోర్‌తో తన ఇన్నింగ్స్‌ను ముగించింది. 20 ఓవర్లకు అన్ని వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్.. 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ బరిలోకి దిగింది.
ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ తమ బౌలింగ్‌తో కట్టడి చేయగలగడంతో ఆస్ట్రేలియా కాస్త తడబడింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కెప్టెన్ ఫించ్ మాత్రం 49 బంతుల్లో 44 పరుగులు చేసి జోర్డాన్ బౌలింగ్‌లో బైర్స్టోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అగర్ 20 బంతుల్లో 20 పరుగులు, వేడ్ 18 బంతుల్లో 18 పరుగులు, కమిన్స్ 3 బంతుల్లో 12 పరుగులు, స్టార్క్ 6 బంతుల్లో 13 పరుగులు చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీశాడు. క్రిస్ వోకెస్ 4 ఓవర్లు వేసి 2 వికెట్లు, మిల్స్ 4 ఓవర్లు వేసి 2 వికెట్లు, లివింగ్స్టన్ 4 ఓవర్లు వేసి ఒక వికెట్, రషీద్ 4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీశారు.
Finch's fighting knock of 44 comes to an end.
— T20 World Cup (@T20WorldCup) October 30, 2021
Jonny Bairstow takes a stunning catch at long-off 👏#T20WorldCup | #AUSvENG | https://t.co/82wjRVDecK pic.twitter.com/gRHptIsFSN
A magnificent bowling performance helps England restrict Australia to 125.
— T20 World Cup (@T20WorldCup) October 30, 2021
Can the Australian attack defend this total? 🤔#T20WorldCup | #AUSvENG | https://t.co/82wjRVDecK pic.twitter.com/ieq02k34l3