సిడ్నీ : ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సారథిగా యువ ఆల్‌రౌండర్ సోఫీ మొలిని ఎంపికైంది. ప్రస్తుత సారథి అలిస్సా హీలి అన్ని ఫార్మాట్లకూ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ).. మొలినితో ఆ స్థానాన్ని భర్తీ చేసింది.
త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌తో ఆమె ఆసీస్ సారథిగా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నది. భారత్‌తో వన్డే, టెస్టులు ముగిశాక.. మూడు ఫార్మాట్లలోనూ ఆమె సారథిగా వ్యవహరిస్తుందని సీఏ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.