మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టు(#AUSvIND) తొలి రోజు ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 రన్స్ చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీసుకోగా, ఆకాశ్, జడేజా, సుందర్ .. చెరో వికెట్ తీసుకున్నారు. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్నది. 19 ఏళ్ల యువ బ్యాటర్ సామ్ కొన్‌స్టాస్ .. మెల్బోర్న్ టెస్టులో అరంగేట్రం చేశాడు. ఇండియన్ పేస్ బౌలర్లలను అతను ధీటుగా ఎదుర్కొన్నాడు. తొలి టెస్టులోనే అతను హాఫ్ సెంచరీ చేశాడు. 60 రన్స్ చేసి జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తొలి వికెట్‌కు కొన్‌స్టాస్, ఖవాజా మధ్య 89 రన్స్ భాగస్వామ్యం ఏర్పడింది.
That’s Stumps on Day 1
Australia reach 311/6 with Jasprit Bumrah leading the way with 3️⃣ wickets
Updates ▶️ https://t.co/njfhCncRdL#TeamIndia | #AUSvIND pic.twitter.com/8CPfzzk1gH
— BCCI (@BCCI) December 26, 2024
తొలి రోజు ఆట ముగిసే సమయానికి స్టీవ్ స్మిత్ 68, ప్యాట్ కమ్మిన్స్ 8 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బ్యాటర్లలో మార్నేస్ లబుషేన్ 72, ఉస్మాన్ ఖవాజా 57 రన్స్ చేశారు. మెల్బోర్న్ టెస్టుకు భారత జట్టు ఓ మార్పు చేసింది. గిల్‌ను పక్కన పెట్టేసి.. వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నది. టీనేజర్ కొన్‌స్టాస్ ఆడి తీరు అందర్నీ ఆకట్టుకున్నది. తొలి టెస్టు ఆడుతున్న అతను.. కేవలం 65 బంతుల్లో 60 రన్స్ చేశాడు. టాప్ నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేసినా.. ఎవరు కూడా సెంచరీ చేరుకోలేకపోయారు. సుమారు 88 వేల మంది ప్రేక్షకుల ముందు మొదటి రోజు తన అరంగేట్రంతో కొన్‌స్టాస్ అదరగొట్టాడు.
Four Australians brought up half-centuries in front of 87,242 fans.
Your Day One #AUSvIND blog recap: https://t.co/LSqCHmFFaf pic.twitter.com/StioiNRJzZ
— cricket.com.au (@cricketcomau) December 26, 2024