ODI World Cup : ఐసీసీ టోర్నీల్లో తిరుగులేని ఆస్ట్రేలియా (Australia) మరోసారి వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏడుసార్లు విజేతగా నిలిచిన ఆసీస్ పటిష్టమైన స్క్వాడ్‌తో భారత్‌కు వస్తోంది. అలీసా హేలీ (Alyssa Healy) కెప్టెన్‌గా శుక్రవారం సెలెక్టర్లు పదిహేను మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. ఎప్పటిలానే ఇప్పుడు కూడా మ్యాచ్ విన్నర్లు అయిన ఆల్రౌండర్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. గాయం నుంచి కోలుకున్న లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్ సోఫీ మొలినెక్స్(Sophie Molineux), డార్సీ బ్రౌన్, జార్జియా వరేహమ్లను వరల్డ్ కప్ స్క్వాడ్‌లోకి తీసుకున్నారు.
‘వరల్డ్ కప్ స్క్వాడ్ ఎంపికలో మేము అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాం. భారత్, శ్రీలంకలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్టారని తెలుసు. అందుకే.. సోఫీ మొలినెక్స్కు స్క్వాడ్‌లో చోటిచ్చాం. గాయం నుంచి కోలుకుంటున్న ఆమె వరల్డ్ కప్ వరకూ ఫిట్నెస్ సాధిస్తుందనే నమ్మకం మాకుంది అని ఆస్ట్రేలియా జాతీయ సెలెక్టర్ షాన్ ప్లెగ్లెర్ వెల్లడించాడు.
The @AusWomenCricket World Cup squad has landed!
Congratulations and good luck to all players selected 💪 #CricketWorldCup pic.twitter.com/sI7nSRctth
— Cricket Australia (@CricketAus) September 4, 2025
ప్రపంచ కప్‌లో అధిపత్యం చెలాయించే ఆసీస్ ఈసారి కూడా మెగా టోర్నీకి పక్కా ప్లాన్‌తో వస్తోంది. టాపార్డర్‌లో దంచికొట్టేందుకు అలీసా హేలీ, డార్సీ బ్రౌన్, ఫొబే లిచ్‌ఫీల్డ్ ఉన్నారు. తహ్లియా మెక్‌గ్రాత్, జార్జియా వరేహం, ఎలీసా పెర్రీ, అషే గార్డ్నర్ ఆల్రౌండర్లుగా ఇరగదీయడం ఖాయం. మేఘన్ షట్, సథర్లాండ్, జార్జియా వొల్తో కూడిన పేస్ దళం కూడా పటిష్టంగానే ఉంది.
ఆస్ట్రేలియా స్క్వాడ్ : అలీసా హేలీ(కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్(వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, అషే గార్డ్నర్, కిమ్ గార్త్, గ్రేస్ హ్యారిస్, అలనా కింగ్, ఫొబే లిచ్‌ఫీల్డ్, సోఫీ మొలినెక్స్, బేత్ మూనీ, ఎలీసా పెర్రీ, మేగన్ షట్, అనాబెల్ సథర్లాండ్, జార్జియా వొల్, జార్జియా వరేహమ్.
వరల్డ్ కప్ ముందు భారత జట్టుతో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం వరల్డ్ కప్ స్క్వాడ్‌కు అదనంగా మరో ఇద్దరిని తీసుకున్నారు. ఆల్‌రౌండర్ చార్లీ నాట్, వికెట్ కీపర్ – బ్యాటర్ అయిన నికొలే ఫాల్టమ్ను ఎంపిక చేశారు. ఈ ఇద్దరూ వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కాగానే స్వదేశానికి బయల్దేరుతారు. మెగా టోర్నీ లీగ్ దశలో అక్టోబర్ 1న న్యూజిలాండ్‌తో ఆసీస్ తలపడనుంది. ఇప్పటివరకూ ఆస్ట్రేలియా 1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022లో వలర్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది.