అడిలైడ్: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood).. అడిలైడ్‌లో భారత్‌తో జరిగే రెండో టెస్టుకు దూరం కానున్నాడు. గాయం వల్ల అతన్ని పక్కనపెట్టేశారు. కానీ సిరీస్‌లో మిగితా మ్యాచ్‌ల నిమిత్తం జరిగే ప్రిపరేషన్ కోసం హేజిల్‌వుడ్ అడిలైడ్‌లోనే ఉండనున్నారు. రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా తమ జట్టులో సీన్ అబ్బాట్, బ్రెండన్ డగ్గెట్లను చేర్చింనట్లు బోర్డు తెలిపింది. వీరితో పాటు బూ వెబ్‌స్టర్ కూడా జట్టులో కొత్తగా చేరనున్నాడు. అయితే హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్‌ను తుది జట్టుకు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
రెండో టెస్టును పింక్ బాల్‌తో నిర్వహించనున్నారు. నిజానికి పింక్ బాల్ టెస్టుల్లో హేజిల్‌వుడ్‌కు మంచి రికార్డు ఉన్నది. 2020-21 సిరీస్‌లో భారత్‌పై హేజల్‌వుడ్ 5 ఓవర్లలో 5వికెట్లు తీసుకున్నాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఇండియా 36 రన్స్‌కే ఆలౌటైంది. భారత్‌తో జరిగే స్వదేశీ టెస్టుకు హేజిల్‌వుడ్ దూరం కావడం ఇదే మొదటిసారి.
ఇవాళ కాన్బెరాలో ప్రైమ్‌మినిస్టర్స్ లెవన్ జట్టుతో జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్ ఆలస్యం అవుతోంది. వర్షం వల్ల ఇప్పటి వరకు టాస్ పడలేదు. మనూకా ఓవల్ మైదానంలో ఈ రెండు రోజుల మ్యాచ్ జరుగుతోంది.