ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్లాన్ బౌల్డ్ అయ్యాడు. హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్ చేరాడు. 38 బంతుల్లో 53 పరుగులు చేసి 4 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. ఈ మ్యాచ్లో వార్నర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆస్ట్రేలియా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుతం క్రీజులో మార్ష్, మ్యాక్స్వెల్ ఉన్నారు. 13 ఓవర్లకు ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. మార్ష్ 30 బంతుల్లో 47 పరుగులు చేయగా.. మ్యాక్స్వెల్ 3 బంతుల్లో ఒక పరుగు చేశాడు.
A massive breakthrough for New Zealand 👊
— T20 World Cup (@T20WorldCup) November 14, 2021
Trent Boult castles David Warner, who is gone for 53.
Will this prove to be a game-changing moment? #T20WorldCup | #T20WorldCupFinal | #NZvAUS | https://t.co/1HyoPN4N0d pic.twitter.com/tG2uykby2G