సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నిర్ణయాత్మక టెస్టులో భారత్ (IND vs AUS) పోరాడుతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో 185 రన్స్‌కే ఆలౌట్ అయిన టీమ్ఇండియా.. ఆసీస్ బ్యాటర్లను కట్టడిచేస్తున్నది. 57 రన్స్‌కే 4 వికెట్లు తీశారు. వికెట్ కోల్పోయి 9 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 6 రన్స్ మాత్రమే జోడించి మరో వికెట్ నష్టపోయింది. 15 పరుగుల వద్ద లబుషేన్‌ను (2) బుమ్రా ఔట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియాలో ఒకే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బుమ్రా (2) రికార్డు సృష్టించాడు. అంతకుముందు 1977-78లో ఒకే సిరీస్‌లో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్లు పడగొట్టాడు.
కాగా, మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ 2 బాల్‌కు కాన్స్టాప్ (23)ను ఔట్‌చేశాడు. స్లిప్‌లో జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అదే ఓవర్ 5వ బాల్‌కు ట్రావిస్ హెడ్ (4) వికెట్‌ను సిరాజ్ పడగొట్టాడు. దీంతో 39 రన్స్‌కే ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయింది. అయితే అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన వెబ్‌స్టర్.. స్టీవ్ స్మిత్‌తో కలిసి స్కోర్‌బోర్డుకు ఒక్కోపరుగు జోడిస్తున్నారు. ప్రస్తుతం 19 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 66 రన్స్ చేసింది. ఆసీస్ మరో 121 రన్స్ చేయాల్సి ఉంది. బుమ్రా, సిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు.