David Warner | రోడ్డు ప్రమాదం కారణంగా ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిస్ చేసుకున్న రిషబ్ పంత్‌కు ఇప్పుడు ఐపీఎల్లో కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. ఐపీఎల్ 2023కి సంబంధించి రిషబ్ పంత్‌ను కెప్టెన్ స్థానం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తొలగించింది. ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్‌గా అవకాశం ఇచ్చింది. వైస్ కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను నియమించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటన చేసింది.
గత ఏడాది చివరన రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబంతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఢిల్లీ నుంచి బయల్దేరిన పంత్ కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో టీమిండియా తరఫున పలు కీలక సిరీస్‌లకు పంత్ దూరమయ్యాడు. తాజాగా ఐపీఎల్ 2023 కూడా ఆడటం లేదు. ఈ క్రమంలో పంత్ స్థానంలో అనుభవజ్ఞుడిని కెప్టెన్‌గా నియమించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావించింది. ఈ క్రమంలో ఐపీఎల్లో సుదీర్ఘకాలం కెప్టెన్‌గా పనిచేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్‌గా అవకాశం వచ్చింది.
David Warner 👉🏼 (𝗖)
Axar Patel 👉🏼 (𝗩𝗖)All set to roar loud this #IPL2023 under the leadership of these two dynamic southpaws 🐯#YehHaiNayiDilli | @davidwarner31 @akshar2026 pic.twitter.com/5VfgyefjdH
— Delhi Capitals (@DelhiCapitals) March 16, 2023
2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత ఒకసారి హైదరాబాద్‌ఉ చాంపియన్‌గా నిలిపాడు. ఐదు సార్లు ప్లేఆఫ్స్ వరకు తీసుకెళ్లాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్‌ల్లో ఒకటిగా నిలిపాడు. కానీ పలు అనివార్య కారణాల వల్ల 2021 ఐపీఎల్ సీజన్ మధ్యలో తన కెప్టెన్సీని కోల్పోయాడు. ఆ తర్వాత జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ఇక గత ఏడాది ఐపీఎల్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఇప్పుడు ఆ జట్టుకు కెప్టెన్‌గా మారాడు.