AUSW vs WIW : మహిళల టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తలపడుతున్నాయి. ఓవల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ సోఫీ మొలినెక్స్ బౌలింగ్ తీసుకుంది. లీగ్ దశను అజేయంగా ముగించిన కంగారూ టీమ్‌కు విండీస్ చెక్ పెడుతుందా? ఫైనల్లో తొలి అడుగు ఎవరిది? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అయితే.. గతంలో మూడుసార్లు ఆస్ట్రేలియా సెమీస్‌లోనే ఓడిన కరీబియన్ టీమ్ ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది.
నాకౌట్లో తిరుగులేని రికార్డున్న ఆస్ట్రేలియాను వెస్టిండీస్ నిలువరిస్తుందా? అనేది ఆసక్తి రేపుతోంది. గతంలో ఏకంగా మూడుసార్లు కంగారుల జోరుకు నిలవలేక సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది విండీస్. దాంతో.. ఈసారి ఫలితం మారుతుందా? కంగారూలకు హేలీ మాథ్యూస్ సేన చెక్ పెడుతుందా? అనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది. ఓవల్ మైదానంలో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో ఇరుజట్ల మధ్య తగ్గపోరు ఖాయమనిపిస్తోంది. చరిత్రను తిరగరాస్తామని చెబుతున్న మాథ్యూస్.. భారీ స్కోర్‌తో ఆసీస్‌కు సవాల్ విసరాలని భావిస్తోంది.
It’s semi-final time 🍿
Australia are unchanged, West Indies bring in Karishma Ramharack for Ashmini Munisar#AUSvWI #T20WorldCup pic.twitter.com/wdmD1nBMS3
— Cricinfo (@cricinfo) June 30, 2026
ఆస్ట్రేలియా తుది జట్టు : బేత్ మూనీ(వికెట్ కీపర్), జార్జియా వోల్, ఫొబే లిచ్‌ఫీల్డ్, ఎలీసా పెర్రీ, అషే గార్డ్నర్, జార్జియా వరేహం, అనాబెల్ సథర్లాండ్, నికోలా కారే, సోఫీ మొలినెక్స్(కెప్టెన్), లూసీ హామిల్టన్, కిత్ గార్త్.
వెస్టిండీస్ తుది జట్టు : హేలీ మాథ్యూస్(కెప్టెన్), క్వియానా జోసెఫ్, డియాండ్ర డాటిన్, షెమైనె క్యాంప్‌బెల్(వికెట్ కీపర్), స్టెఫానీ టేలర్, జజర క్లాక్స్టన్, చినెల్లె హెన్రీ, జన్నిల్లీ గ్లాస్గో, అలియహ్ అల్లెనే, అఫీ ఫ్లెచర్, కరిష్మ రామ్హరాక్.