డార్విన్ : దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా డార్విన్‌లోని మర్రార క్రికెట్ గ్రౌండ్లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఆసీస్.. 17 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై ఉత్కంఠ విజయం సాధించింది. మ్యాచ్‌లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన కంగారూలు.. 20 ఓవర్లలో 178 రన్స్‌కు ఆలౌట్ అయ్యారు. 7.4 ఓవర్లలో 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ (52 బంతుల్లో 83, 4 ఫోర్లు, 8 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ (13 బంతుల్లో 35, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేసి సఫారీల బౌలింగ్‌ను చీల్చి చెండాడారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంఫక (4/20), రబాడా (2/29) రాణించారు. అనంతరం ఛేదనలో సఫారీలు.. విజయానికి దగ్గరగా వచ్చినా నిర్ణీత ఓవర్లలో 161/9 వద్దే ఆగిపోయారు. ఓపెనర్ రియాన్ రికెల్టన్ (55 బంతుల్లో 71, 7 ఫోర్లు, 1 సిక్స్), ట్రిస్టన్ స్టబ్స్ (37) పోరాడారు. ఆఖరి ఓవర్లో ఆతిథ్య జట్టు విజయానికి 21 పరుగుల అవసరమున్న దశలో డ్వార్షియస్ వేసిన చివరి ఓవర్లో రెండో బంతికి రికెల్టన్ భారీ షాట్ ఆడినా లాంగాన్ వద్ద మ్యాక్స్‌వెల్ కండ్లు చెదిరే క్యాచ్ అందుకోవడంతో సఫారీల ఆశలు అడియాసలయ్యాయి. ఆసీస్ బౌలర్లలో డ్వార్షియస్ (3/26), హాజిల్‌వుడ్ (3/27) ఆతిథ్య జట్టు బ్యాటర్లను కట్టడిచేశారు. పొట్టి ఫార్మాట్లో ఆసీస్‌కు ఇది వరుసగా 9వ విజయం కావడం విశేషం.