మెల్బోర్న్ : వచ్చే నెలలో భారత్‌లో పర్యటించే ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో స్టార్ కీపర్-బ్యాటర్ ఆలిస్సా హీలి, ఎడమచేతి పేసర్ లారెన్ చీతల్‌కు అవకాశం కల్పించారు. మెగ్ లానింగ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆమె స్థానంలో ఎవరు సారధ్యం వహిస్తారన్నది ఇంకా వెల్లడించలేదు.
ఆస్ట్రేలియా జట్టు భారత జట్టుతో ఒక టెస్టు మ్యాచ్, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. మ్యాచ్‌లన్నీ ముంబైలోనే నిర్వహించనున్నారు. టి20లకు డివై పాటిల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.