భువనేశ్వర్: ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా 12వ సారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో ఆస్ట్రేలియా 4-3 తేడాతో స్పెయిన్‌పై అద్భుత విజయం సాధించింది. ఆసీస్ తరఫున జెరెమీ హెవర్డ్(32ని, 36ని) డబుల్ గోల్స్‌తో అలరించగా, ఒగ్లీవ్ ఫ్లిన్(29ని), జాలెస్కీ ఆరన్ (31ని) ఒక్కో గోల్ చేశారు. జేవియర్ (19ని), మార్క్(23ని), మిరాలెస్ మార్క్(40ని) స్పెయిన్‌కు ఒక్కో గోల్ అందించారు. నెదర్లాండ్స్, దక్షిణకొరియా మధ్య క్వార్టర్స్ విజేతతో సెమీస్‌లో ఆసీస్ తలపడుతుంది. మరో క్వార్టర్స్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం 2-0తో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.