మెల్బోర్న్: ప్రఖ్యాత లార్డ్స్ (లండన్) వేదికగా వచ్చే నెల 11 నుంచి మొదలుకాబోయే ప్రతిష్టాత్మక ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) టైటిల్ పోరు కోసం డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా.. 15 మందితో కూడిన తమ జట్లను మంగళవారం ప్రకటించాయి. 2023-25 సైకిల్లో భాగంగా సౌతాఫ్రికా 12 టెస్టులు ఆడి 8 విజయాలు, 69.44 పాయింట్లు సాధించి అగ్రస్థానంతో ఫైనల్ చేరగా ఆసీస్ 19 మ్యాచ్‌లలో 13 గెలిచి 67.54 పాయింట్లతో రెండో స్థానాన నిలిచింది.
పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆసీస్, టెంబ బవుమా నాయకత్వంలోని సఫారీలు.. ఐసీసీ గద కోసం తలపడనున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా భారత్‌తో అరంగేట్రం చేసి ఆడిన తొలి మ్యాచ్‌లోనే సంచలన ప్రదర్శన చేసిన సామ్ కొన్‌స్టాస్‌తో పాటు కొద్దిరోజుల క్రితం గాయంతో జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఫైనల్‌కు సెలక్ట్ అయ్యారు. ఇక సఫారీ జట్టులో పేసర్ లుంగి ఎంగిడి తిరిగి జట్టులోకి వచ్చాడు.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మాట్ కుహ్నెమన్, మార్నస్ లబూషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, వెబ్‌స్టర్.
దక్షిణాఫ్రికా: టెంబ బవుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్మ్,్ర డేవిడ్ బెడింగ్హమ్, కార్బిన్ బాష్, టోని డి జొర్జి, మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్, వియాన్ మల్డర్, ముత్తుసామి, లుంగి ఎంగిడి, డేన్ పీటర్సన్, కగిసొ రబాడా, రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెయ్న.