Itlu Arjuna | కొన్ని రోజులుగా నెట్టింట Newguyintown హ్యాష్ ట్యాగ్‌తో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ చేసిన సంగతి తెలిసిందే. హీరో ఎవరనేది సస్పెన్స్‌లో పెడుతూ షేర్ చేసిన ప్రీ లుక్స్ నెట్టింట హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఆ సస్పెన్స్‌కు తెరదించారు మేకర్స్. ఈ చిత్రానికి ఇట్లు అర్జున టైటిల్ ఫిక్స్ చేస్తూ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. మహేశ్ ఉప్పల డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రంలో అనీష్ హీరోగా నటిస్తున్నాడు.
తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడైన డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా మారుతుండటం విశేషం. ప్రేమ అది ఎంత దూరమైనా పరుగెత్తిస్తుంది. కానీ ఎంత ఇష్టమో చెప్పలేం. ప్రేమ అందరి మనసుల్లో పుడుతుంది. కానీ ఎంతమంది చెప్పగలరు. నిజానికి మాటల్లో కూడా సరిగా చెప్పలేనిదే ప్రేమ.. నాగార్జున వాయిస్ ఓవర్‌తో సాగుతున్న సోల్ ఆఫ్ అర్జున సినిమా థీమ్ ఏంటో హింట్ ఇచ్చేసింది.
వెంకీ కుడుముల కొత్తగా లాంచ్ చేసిన What Next Entertainments బ్యానర్లో ఈ సినిమా రాబోతుంది. పాపులర్ మలయాళ భామ అనస్వర రాజన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గానటిస్తోంది. ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి రాజ మహదేవన్ సినిమాట్రోఫర్. న్యూ ఏజ్ లవ్ స్టోరీ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కొత్త నటీనటులతోపాటు పాపులర్ యాక్టర్లు నటించనున్నారని సమాచారం.
+