Damien Martyn : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామిన్ మార్టిన్ (Damien Martyn) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రాణాంతకమైన ‘మెనింజిటిస్’ (Meningitis)తో బాధ పడుతున్న మార్టిన్ కోమా నుంచి బయటపడడమే కాదు.. దవాఖాన నుంచి ఇంటికొచ్చేశాడు. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన ఈ మాజీ ఆటగాడి ఆరోగ్యం మెరుగుపడడంతో గురువారం వైద్యులు ఆస్పత్రి నుంచి పంపించేశారు. దాంతో.. మృత్యుంజయుడిలా తిరగొచ్చిన అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అసలేం జరిగిందంటే.. 54 ఏళ్లున్న డామిన్ మార్టిన్ ప్రాణాంతకమైన మెనింజిటిస్ వ్యాధితో పోరాడుతున్నాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన మార్టిన్‌ను డిసెంబర్ 26న గోల్డ్ కోస్ట్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. మెదడు చుట్టున్న పొరలు వాపు, ఇన్ఫెక్షన్ కారణంగా అతడు బతికిబట్టకట్టడం కల్లే అనుకున్నారంతా. కానీ, అద్భుతం జరిగింది. అనూహ్యంగా అతడు ఇండ్యూస్డ్ కోమా(Induced Comma) నుంచి బయటపడ్డాడు. ఐసీయూలో చికిత్స అందించిన డాక్టర్లు.. మరో వార్డుకు మార్చారు. గురువారం డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు.
Damien Martyn has been released from hospital after waking from an induced coma.
Martyn was rushed to hospital in late December amid a bout of meningitis, an infection and swelling of fluid and membranes around the brain and spinal cord.
The 54-year-old former Australian… pic.twitter.com/PokAh1JiNL
— ABC SPORT (@abcsport) January 8, 2026
మార్టిన్ ఆరోగ్యంపై అతడి స్నేహితుడు, మాజీ ఓపెనర్ ఆడం గిల్‌క్రిస్ట్ ‘కోడ్ స్పోర్ట్స్’తో మాట్లాడాడు. ‘మార్టిన్ విషయంలో అద్భుతం జరిగిందని చెప్పాలి. వైద్యానికి అసాధారణంగా స్పందించిన మార్టిన్ కోమా నుంచి బయటకొచ్చాడు. స్పృహలోకి వచ్చిన అతడు మాట్లాడడమే కాదు అందర్నీ గుర్తు పట్టాడు. దాంతో.. వైద్యులు అతడిని ఐసీయూ నుంచి మరో వార్డుకు మార్చారు. అతడు మరింత వేగంగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ కష్ట కాలంలో అభిమానులు చూపిన ప్రేమ, అందించిన దీవెనలు, ఆర్ధిక సాయానికి అతడి భార్య అమంద కృతజ్ఞతలు చెబుతోంది’ అని గిల్‌క్రిస్ట్ తెలిపాడు.
Damien Martyn has emerged from an induced coma, with his family describing his recovery from meningitis as a ‘miraculous’ turnaround.
What A Wonderful News ♥️
— Cricketopia (@CricketopiaCom) January 4, 2026
ఆసీస్ వెటరన్ ఆటగాడైన మార్టిన్ 1992లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే తన విధ్వంసక ఆటతో జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగిన అతడు.. 1999, 2003లో ప్రపంచకప్ గెలుపొందిన జట్టులో సభ్యుడు. 67 టెస్టులు, 208 వన్డేలు ఆడాడు. భారత్ పర్యటనలో 2-1తో ఆసీస్ సిరీస్ గెలుపొందడంలో అతడి పాత్రే కీలకం.