Mohammed Shami | సిడ్నీ: త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లేకపోవడం రోహిత్ సేనకు పెద్ద ఎదురుదెబ్బ అని ఆసీస్ హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. అయితే షమీ లేకపోయినా రిజర్వ్ పేసర్లు సైతం ఆసీస్‌లో సంచలనాలు సృష్టించగలరని తమకు తెలుసునని ఆ మేరకు తాము సిద్ధమయ్యామని తెలిపాడు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ మాట్లాడుతూ.. ‘ఆసీస్‌కు రాబోయే భారత జట్టులో షమీ లేకపోవడం భారీ లోటు.
గత సిరీస్‌లలో అతడు తన పేస్, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో మా బ్యాటర్లను ఎన్నో ఇబ్బందులకు గురిచేశాడు. షమీ లేకపోవడం మాకు కలిసొచ్చేదే కానీ అతడు లేకపోయినా బుమ్రా నేతృత్వంలోని భారత పేస్ దళం అద్భుతాలు చేయగలదని మాకు తెలుసు. గత సిరీస్‌లో రిజర్వ్ బౌలర్లతో బరిలోకి దిగినా భారత్ మెరుగైన ఫలితాలు సా వారిని తక్కువగా అంచనా వేయ అని చెప్పాడు. నవంబర్ 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి తెరలేవనుంది.