Damien Martyn : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామిన్ మార్టిన్ (Damien Martyn) కొత్త ఏడాదిని కొత్తగా గడుపుతున్నాడు. ప్రాణాంతకమైన ‘మెనింజిటిస్’ (Meningitis) జబ్బు కారణంగా చావు అంచులదాకా వెళ్లొచ్చిన మార్టిన్.. ఇప్పుడు బీచ్‌లో సేదతీరుతున్నాడు. పది రోజుల క్రితం కోమాలో ఉన్న ఆసీస్ దిగ్గజం తాజాగా సముద్రపు అందాల్ని వీక్షిస్తున్న ఫొటోను పంచుకున్నాడు. ఈ సందర్భంగా తనకోసం ప్రార్ధించిన వాళ్లందరికీ మనఃస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడీ వెటరన్ ప్లేయర్.
కొన్నాళ్లుగా మెనింజిటిస్ వ్యాధితో బాధ పడుతున్న మార్టిన్‌కు ఇది రెండో జీవితమనే చెప్పాలి. నిరుడు డిసెంబర్ 26న ఇండ్యూస్ట్ కోమా (Induced Comma) కారణంగా ఆస్పత్రిలో చేరిన అతడు.. అనూహ్యంగా కోలుకున్నాడు. మెదడు చుట్టున్న పొరలు వాపు, ఇన్ఫెక్షన్ కారణంగా అతడు బతికిబట్టకట్టడం కల్లే అనుకున్నారంతా.
This post is A BIG thank you to ALL my family, friends and so many other people who have reached out to me!
On the 27th of December 2025 my life was taken out of my hands…when meningitis took over my brain, & unbeknownst to me I was placed into a paralysed coma for 8 days to… pic.twitter.com/3Mt3DS6MZY
— Damien Martyn🏏 (@damienmartyn) January 17, 2026
కానీ, ఏదో అద్భుతం జరిగినట్టుగా మార్టిన్ వైద్యానికి మెరుగ్గా స్పందించాడు. ఇంకేముంది.. చావు అంచుల దాకా వెళ్లిన ఈ దిగ్గజ ఆటగాడు.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ జనవరి 8వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. 54 ఏళ్ల మార్టిన్. అప్పటి నుంచి ఇంటి వద్ద ఉంటూ మెరుగైన అతడు శనివారం బీచ్‌లో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫోటకు భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టాడతడు.
Damien Martyn rising from his coma to watch this pic.twitter.com/KCgYlISYBS
— Tom Studans (@maximumwelfare) January 8, 2026
‘నా కోసం ప్రార్ధించిన నా కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు ఈ పోస్ట్‌తో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. డిసెంబర్ 27న నా జీవితం నా చేతుల్లోంచి వెళ్లిపోయింది. మెనింజిటిస్ మెదడుకు వ్యాపించగా 8 రోజులు కోమాలో ఉన్నాను. ఈ ప్రాణాంతకమైన జబ్బుతో అద్భుతంగా పోరాడాను. వైద్యులు నేను బతికే అవకాశం యాభై శాతం ఉందని చెప్పారు. కానీ, అనూహ్యంగా స్పృహలోకి వచ్చా. ఆ తర్వాత నాలుగు రోజులకే నేను నడవడం చూసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఇంటికి తిరిగొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సముద్రపు ఒడ్డులోని ఇసుకలో పాదాలను పెట్టి.. ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించడం గొప్పగా అనిపిస్తోంది. జీవితం అనేది ఊహకు అందదని, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమనే విషయాన్ని.. కాలం గొప్పతనాన్ని నేను ఈ స్వల్ప వ్యవధిలోనే తెలుసుకున్నాను.
Former Australian cricketer Damien Martyn has revealed he was given a “50-50 chance” of surviving meningitis and was unable to walk or talk when he woke from a coma.
Read more: https://t.co/2MbH4LjkZl pic.twitter.com/jk7AfbNTJE
— The Courier-Mail (@couriermail) January 17, 2026
ఈ ప్రపంచంలో వైద్యులు, నర్సులు, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు ఇలా.. ఎందరో అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. గత మూడు వారాల్లో వీరందరిని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది నేను కోలుకోవాలని బలంగా కోరుకున్నారు. నా క్షేమాన్ని ఆశిస్తూ సందేశాలు పంపించారు. మీ అందరికి నేను రుణపడి ఉంటాను. మరోసారి మీకు కృతజ్ఞతలు. 2026 సంవత్సరం నన్ను నాకు తిరిగి ఇచ్చింది’ అని మార్టిన్ పెట్టిన పోస్ట్ చదివిన వారంత చెమర్చిన కళ్లను తుడుకుంటూ.. ‘నువ్వు మృత్యుంజయుడివి’ అని కామెంట్లు పెడుతున్నారు.
ఆసీస్ వెటరన్ ఆటగాడైన మార్టిన్ 1992లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే తన విధ్వంసక ఆటతో జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగిన అతడు.. 1999, 2003లో ప్రపంచకప్ గెలుపొందిన జట్టులో సభ్యుడు. 67 టెస్టులు, 208 వన్డేలు ఆడాడు. భారత్ పర్యటనలో 2-1తో ఆసీస్ సిరీస్ గెలుపొందడంలో అతడి పాత్రే కీలకం.