IPL 2026 : పొట్టి క్రికెట్ లీగ్‌లో పాపులరైన ఐపీఎల్‌కు ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ఆడేందుకు సొంత జట్టకు సైతం దూరమయ్యే ఆటగాళ్లున్నారు. పలు దేశాల బోర్డులు కూడా తమ క్రికెటర్లను ఐపీఎల్ ఆడేందుకు అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్(Cricket Australia) సైతం తమ ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడకున్నా పర్లేదు.. ఐపీఎల్ బాధ్యతలను పూర్తి చేయండి’ ఆసీస్ బోర్డు స్పష్టం చేసింది.
పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు స్క్వాడ్‌ను గురువారం ప్రకటించింది ఆస్ట్రేలియా. మే 30వ తేదీ నుంచి ఆతిథ్య జట్టుతో ఆసీస్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. షెడ్యూల్ ప్రకారం మే 22న కంగారూ టీమ్ ఇస్లామాద్లో వాలిపోవాలి. అయితే.. ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ మే 31 వరకూ జరుగనుంది. దాంతో, ఐపీఎల్ విధుల్లో ఉన్నప్రధాన ఆటగాళ్లను పాక్ పర్యటనకు వెళ్లకున్నా పర్లేదని ఆసీస్ బోర్డు చెప్పింది.
Pat Cummins, Josh Hazlewood, and Mitchell Starc are among a host of Australians who look set to miss a three-match ODI tour of Pakistan later this month
Details: https://t.co/XiuYufJ51Z pic.twitter.com/90lTBuIBDH
— ESPNcricinfo (@ESPNcricinfo) May 7, 2026
దాంతో, వన్డే సారథి ప్యాట్ కమిన్స్ సహా దాదాపు పన్నెండు మందికిపైగా ఆస్ట్రేలియా క్రికెటర్లు భారత్‌లోనే ఉండిపోనున్నారని క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్న ప్రతిసారి తమ ఆటగాళ్లను వెనక్కి పిలిచే ఆసీస్ బోర్డు ఈసారి ఐపీఎల్ పూర్తయ్యాకే రండి అని చెప్పడం విశేషం. లీగ్ దశ మే 24న ముగియనుంది. అప్పటికే ప్లే ఆఫ్స్ ఆడే నాలుగుజట్లేవో తేలుతుంది. దాంతో. ఈ నాకౌట్ మ్యాచ్‌లకు, ఆపై ఫైనల్ చేరిన జట్లలోని ఆసీస్ ఆటగాళ్లు టోర్నీ ముగిసేంత వరకూ భారత్‌లోనే ఉండేందుకు ఆ దేశ బోర్డు ఆమోదం తెలిపింది.
ఐపీఎల్ ఆడడం కోసం పాక్ పర్యటనకు డుమ్మా కొట్టేవారిలో వన్డే సారథి ప్యాట్ కమిన్స్, టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్, ప్రధాన పేసర్లు హేజిల్‌వుడ్, బార్ట్లెట్, మిచెల్ స్టార్క్ ఉన్నారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, యువకెరటం కూపర్ కొన్నొల్లీ, స్టోయినిస్ వంటి స్టార్లు ఉన్నారు.
Cooper Connolly is following his idol Shaun Marsh perfectly 🤝 😁
(h/t @bhaleraosarang) pic.twitter.com/xDgKUx61Q9
— ESPNcricinfo (@ESPNcricinfo) May 7, 2026
19వ సీజన్లో కమిన్స్ సన్‌రైజర్స్ కెప్టెన్ కాగా.. హెడ్ ఓపెనర్. కొన్నొల్లీ, స్టోయినిస్, బార్ట్లెట్.. ఈ ముగ్గురు పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్నారు. హేజిల్‌వుడ్ ఆర్సీబీ ప్రధాన పేసర్కగా.. గ్రీన్ కోల్‌కతాకు, స్టార్క్ ఢిల్లీకి, మార్ష్, ఇంగ్లిస్‌లు లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.