Womens World Cup : ప్రపంచకప్ ఏదైనా ఆస్ట్రేలియా ఆధిపత్యం మామూలే. కానీ, పదమూడో సీజన్ వన్డే వరల్డ్‌కప్‌లో మాత్రం భారత జట్టు చేతిలో మాజీ ఛాంపియన్ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. రికార్డు స్థాయిలో తమను కప్ గెలవకుండా చేసిన టీమిండియాపై ఆసీస్ జట్టు సభ్యులు కాస్త గుర్రుగానే ఉన్నారు. తాజాగా కంగారూ పేసర్ కిమ్ గార్త్ (Kim Garth) మాట్లాడుతూ.. సెమీఫైనల్లో ఓటమిని తాము ఇంకా మర్చిపోలేదని అంది. టీమిండియాపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆమె అంటోంది.
ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ పాడ్‌కాస్ట్‌లో శనివారం కిమ్ గార్త్ మాట్లాడింది. ఈ సందర్భంగా వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమిండియా చేతిలో ఓటమిని ప్రస్తావించింది. వచ్చే ఏడాది స్వదేశంలో జరుగబోయే ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌ను ఓడించి దెబ్బకు దెబ్బ తీస్తామని ధీమాగా చెప్పిందీ స్పీడ్‌స్టర్. ‘పదమూడో సీజన్ వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఓటమి మమ్మల్ని ఇంకా బాధిస్తోంది. భారత్ మెరుగైన జట్టే. ఇండియాలో ఆడిన ప్రతి మ్యాచ్ గొప్పగా అనిపిస్తుంది. అయినా సరే పరాజయాన్ని ఇప్పటికీ మేము జీర్ణించకోలేకపోతున్నాం.
World Cup semifinal heartbreak still fresh, says Kim Garth ahead of facing India! 👀#CricketTwitter pic.twitter.com/rbMjtN6Vdf
— Female Cricket (@imfemalecricket) December 27, 2025
ఆ ఓటమికి బదులు తీర్చుకుంటాం. రెండు నెలల్లో టీ20, వన్డే సిరీస్, టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా మా దేశానికి వస్తుంది. అప్పుడు ఓడించి ప్రతీకారం తీర్చుకుంటాం’ అని గార్త్ పేర్కొంది. సెమీఫైనల్లో గార్త్ 7 ఓవర్లలో 46 పరుగులిచ్చి 2 వికెట్లు తీసంది. 2026లో మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఫిబ్రవరి- మార్చిలో ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది.
From relishing a historic World Cup win 🥳
To gearing up for the next goal 🏆
It all starts again today ⏳
Jemimah Rodrigues previews the #INDvSL T20I series 👌👌 – By @mihirlee_58 #TeamIndia | @IDFCFIRSTBank | @JemiRodrigues pic.twitter.com/nKWuTNwi7f
— BCCI Women (@BCCIWomen) December 21, 2025
డీవై పాటిల్ మైదానం వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఫొబే లిచ్‌ఫీల్డ్ (119) సెంచరీతో మెరవగా ఆస్ట్రేలియా 338 పరుగులు చేసింది. అనంతరం భారీ ఛేదనలో టీమిండియాకు షాకిస్తూ ఆరంభంలోనే ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానలను ఔట్ చేసింది కిమ్ గార్త్. దాంతో.. భారత్ ఒత్తిడిలో పడినా జెమీమా రోడ్రిగ్స్ (127 నాటౌట్) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ ఆశలపై నీళ్లు చల్లింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(89)తో కీలక భాగస్వామ్యం.. ఆపై రీచా ఘోష్(26) మెరుపులతో ఫైనల్ చేరింది భారత్. టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తుచేసిన విమెన్ ఇన్ బ్లూ తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది.