T20 World Cup | దుబాయ్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో గురువారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీస్‌లో సౌతాఫ్రికా… 8 వికెట్ల తేడాతో కంగారూలను ఖంగు తినిపించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. బెత్ మూనీ (44), ఎల్లీస్ పెర్రీ (31) ఆసీస్‌ను ఆదుకున్నారు. అనంతరం ఛేదనను సౌతాఫ్రికా.. 17.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్నందుకుంది.
అన్నెకె బోష్ (48 బంతుల్లో 74 నాటౌట్, 8 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి ఆ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించగా సారథి లారా వోల్వార్డ్ (42) రాణించింది. ఈ టోర్నీ ప్రారంభ ఎడిషన్ (2009) తర్వాత ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.