Gabba Test: స్వదేశంలో ఆస్ట్రేలియాను ఓడించడం అంత వీజీ కాదనేది క్రికెట్ గురించి ఓనమాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. విదేశాల్లో పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోయినా దుమ్మురేపే ప్రదర్శనలతో ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి జట్లకు సైతం షాకిచ్చే ఆస్ట్రేలియా.. స్వదేశంలో మరింత దూకుడుగా ఉంటుంది. అటువంటి ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడమంటే పర్యాటక జట్లకు కత్తిమీద సామే. ఆ ప్రయత్నంలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి జట్లు కూడా దెబ్బతిన్నాయి. నిన్నటిదాకా భారత్‌కు ఇందుకు మినహాయింపు ఉండేది. 2019-20, 2020-21 సీజన్లో అక్కడ జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలలో భారత్.. ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ముఖ్యంగా గబ్బా (బ్రిస్బేన్) వేదికగా ముగిసిన నాలుగో టెస్టులో భారత్ సాధించిన విజయం చరిత్రపుటల్లో నిలిచిపోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్‌లు ఆస్ట్రేలియాలో ఆడినా ఏ జట్లూ ఆసీస్ జోరును అడ్డుకోలేకపోయాయి. కానీ తాజాగా విండీస్.. భారత్ సరసన నిలిచింది.36 ఏండ్లలో ఆస్ట్రేలియా.. గబ్బాలో మూడు సార్లు మాత్రమే ఓడింది. ఆ మూడింటిలో ఒకటి భారత్ కాగా రెండు సార్లూ విండీస్‌కే ఆ ఘనత దక్కింది.
అప్పుడు టీమిండియా..
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 2020-21 సీజన్లో భాగంగా ఆసీస్‌కు వెళ్లిన భారత్.. ఆ జట్టుతో నాలుగు టెస్టులు ఆడింది. తొలి టెస్టు ఆసీస్‌దే. రెండో టెస్టులో భారత్ నెగ్గింది. సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రా అయింది. సిరీస్ విజేతను నిర్ణయించే నాలుగో టెస్టు గబ్బాలోనే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ మొదట బ్యాటింగ్ చేసి 369 పరుగులు చేసింది. బదులుగా భౠరత్.. 336 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్.. 294 పరుగులు చేసి భారత్ ముందు 329 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ ఇంత భారీ స్కోరును ఛేదించడం అంత వీజీ కాదు. అదీగాక పాట్ కమిన్స్, జోష్ హెజిల్వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ వంటి బౌలర్లను ఎదుర్కుని.. కానీ టీమిండియా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. రోహిత్ శర్మ (7) విఫలమైనా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (91), పుజారా (56)ల తో పాటు రిషభ్ పంత్ (89 నాటౌట్)లు రాణించి భారత్‌కు అత్యద్భుతమైన విజయాన్ని అందించారు.
OMMMMA!! HISTORY AT THE GABBA! WI beat Australia for the first time in tests in 27 years, thanks to SHAMAR JOSEPH’S 7-68. Aus were 11-0 in day night tests, that record is broken too. A performance of a lifetime, a Hero is born.
Australia were cruising towards the chase of 216 at… pic.twitter.com/zBu7B77Jug
— Srini Mama (@SriniMaama16) January 28, 2024
ఇప్పుడు విండీస్..
2021 కంటే ముందు గబ్బాలో ఆసీస్‌ను ఓడించిన జట్టు విండీస్ మాత్రమే. 1988లో వెస్టిండీస్.. గబ్బాలో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా కమిన్స్ సేనకు షాకిచ్చింది. ఆరంభం నుంచి రసవత్తరంగా సాగిన ఈ పోరులో తొలుత విండీస్ బ్యాటింగ్ చేసి 311 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత విండీస్.. ఆసీస్‌ను 289 పరుగులకు ఆలౌట్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కరేబియన్ జట్టు.. 193 పరుగులు మాత్రమే చేసి ఆసీస్ ముందు 216 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఆట మూడో రోజు రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసిన ఆసీస్.. మూడో రోజు తడబడింది. 2021లో భారత్ తరఫున రిషభ్ పంత్ హీరో అయితే ఇప్పుడు విండీస్‌కు షెమర్ జోసెఫ్ హీరో అయ్యాడు. 11.5 ఓవర్లు వేసిన ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టిన షెమర్.. విండీస్‌కు మరుపురాని విజయాన్ని అందించాడు.