డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో ఆడుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టుకు శుభారంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ కుశాల్ మెండిస్ (5)ను ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ప్యాట్ కమిన్స్ అవుట్ చేశాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధనంజయ డిసిల్వ (6 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. అదే సమయంలో మరో ఓపెనర్ పాథుమ్ నిస్సంక (23 బంతుల్లో 17 నాటౌట్) నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో ఆ జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 36 పరుగులతో నిలిచింది.