AUS vs RSA : టెస్టు క్రికెట్లో ఆసీస్ జట్టు అద్భుతం చేసింది. ఐదు రోజుల టెస్టు ఆటను రెండు రోజుల్లోనే ముగించి చరిత్ర సృష్టించింది. అది కూడా స్వదేశంలో కావడం విశేషం. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో ఆసీస్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై రెండు రోజుల్లోనే టెస్టు మ్యాచ్ ముగియడం అనేది 91 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. మొదటి ఇన్నింగ్స్‌లో 92 రన్స్ చేసిన ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 152 పరుగులకు ఆలౌట్ అయింది. కమిన్స్ 5 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత , కగిసో రబాడ 4 వికెట్లు నేల కూల్చడంతో ఆస్ట్రేలియా 218కి పరిమితమైంది. ట్రావిస్ హెడ్ 92 టాప్ స్కోరర్. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా 99 రన్స్‌కే పది వికెట్లు కోల్పోయింది. 34 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆసీస్ 8 ఓవర్లలోనే ఛేదించారు. దాంతో, ఆట రెండు రోజుల్లోనే పూర్తయింది. మూడు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 26న మొదలుకానుంది.
It’s all over at The Gabba, inside two days!
Australia extend their lead at the top of the #WTC23 standings with a six-wicket win 📈
Watch the rest of the #AUSvSA series LIVE on https://t.co/CPDKNxoJ9v with a Full Tour Pass 📺 pic.twitter.com/OmeITaMEDs
— ICC (@ICC) December 18, 2022