మకాయ్ : ఆస్ట్రేలియా ‘ఏ’తో జరిగిన అనధికారిక రెండో టీ20లో యువ భారత్ ఓటమిపాలైంది. శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ ‘ఏ’ 114 పరుగుల తేడాతో ఆసీస్ ‘ఏ’పై పరాజయం ఎదుర్కొంది. తొలుత ఆసీస్ ‘ఏ’ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఓపెనర్ అలీసా హిలీ (70) ధనాధన్ అర్ధసెంచరీతో జట్టుకు పోరాడే స్కోరు అందించింది.
రాధా యాదవ్ (2/35)కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన యువ భారత్ 15.1 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. దినేశ్ వ్రింద (21), మిన్ను మణి (20) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఉమా ఛెత్రీ, తనూజ కన్వర్ కనీసం పరుగుల ఖాతా తెరువలేకపోయారు. కిమ్ గారెత్ (4/7), అమీ ఎడ్గర్ (2/17), ఫ్లింటాఫ్ (2/23) భారత పతనంలో కీలకమయ్యారు.