న్యూఢిల్లీ, డిసెంబర్ 23 : చైనాలో జాయింట్ వెంచర్లో ఏర్పాటైన సంస్థలో అదనపు 20 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు అరబిందో ఫార్మా ప్రకటించింది. ఇందుకోసం సంస్థ 5.12 మిలియన్ డాలర్ల నిధులను వెచ్చించింది.
చైనాకు చెందిన షాన్డాంగ్ లౌక్సిన్ ఫార్మాస్యూటికల్ గ్రూపుతో కలిసి అరబిందో అనుబంధ సంస్థయైన హెలిక్స్ హెల్త్కేర్లుక్సిన్ జాయింట్ వెంచర్లో భాగంగా లౌక్సిన్ అరవిటాస్ ఫార్మాను నెలకొల్పాయి. దీంట్లో హెలిక్స్కు 30 శాతం వాటా ఉండగా, షాన్డాండ్ లౌక్సిన్కు 70 శాతం వాటా ఉన్నది.
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): వీ-హబ్ ద్వారా మహిళా ఆంత్రప్రెన్యూర్స్ను ప్రోత్సహించడమే లక్ష్యమని సంస్థ సీఈవో సీత పల్లచోళ్ల తెలిపారు. మంగళవారం వీ-హబ్లో 40 మంది మహిళా ఆంత్రప్రెన్యూర్లకు ఆరు వారాల శిక్షణ ముగింపు సర్టిఫికెట్లు అందజేశారు.