హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్(టీపీజీఎల్) సీజన్-4లో ఆటమ్ చార్జర్స్ దూకుడు కొనసాగుతున్నది.
బుధవారం నాలుగో రౌండ్ ముగిసే సరికి చార్జర్స్ 699 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, దాసోస్(675), రిట్జ్ మాస్టర్స్(674) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చార్జర్స్ తరఫున భూషణ్, గౌరవ్ 44 పాయింట్లతో రాణించారు.