లండన్: ఈనెల 20 నుంచి స్వదేశంలో భారత్తో జరుగబోయే ఐదు టెస్టుల సిరీస్కు ముందు ఇంగ్లండ్ బౌలర్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే ఆ జట్టు పేసర్లు మార్క్ వుడ్, ఒలీ స్టోన్ గాయాలతో సతమతమవుతుండగా తాజాగా మరో బౌలర్ గస్ అట్కిన్సన్ కూడా తొడ కండరాల గాయంతో భారత్తో తొలి టెస్టులో ఆడేది అనుమానంగానే ఉంది. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో గాయపడ్డ అట్కిన్సన్.. పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరో మూడు వారాల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశమున్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వర్గాలు తెలిపాయి.