ఓస్లో: యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద(Praggnanandhaa) మళ్లీ షాకిచ్చాడు. హోమ్టౌన్ హీరో, వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ మ్యాగ్నస్ కార్ల్‌సన్‌పై వరుసగా రెండోసారి విక్టరీ కొట్టాడు. నార్వే చెస్ టోర్నీలో క్లాసికల్ గేమ్‌లోనూ కార్ల్‌సన్‌పై స్టన్నింగ్ విక్టరీ సాధించాడు ప్రజ్ఞానంద. మరోవైపు వరల్డ్ చాంపియన్ డీ గుకేశ్.. నార్వే టోర్నీలో చేతులెత్తేశారు. 8వ రౌండ్ గేమ్‌లో ఫ్రెంచ్ గ్రాండ్‌మాస్టర్ అలిరేజా ఫిరౌజా చేతిలో ఓటమి పాలయ్యాడు.దీంతో పాయింట్ల పట్టికలో గుకేశ్ దిగువ స్థాయిలో ఉండిపోయాడు. డబుల్ రౌండ్ రాబిన్ ఎలైట్ ఈవెంట్లో ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ కనబరిచారు.
క్లాసికల్ గేమ్‌లో ఈ ఏడాది కార్ల్‌సన్‌పై రెండు సార్లు గెలిచిన ప్లేయర్‌గా ఇండియన్ స్టార్ నిలిచాడు. ఈ టోర్నీలో ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. కానీ 20 ఏళ్ల ప్రజ్ఞానంద 12 పాయింట్లతో ప్రస్తుతం మూడవ స్థానంలో ఉన్నాడు. అలీరేజా 13 పాయింట్లతో రెండో స్థానంలో, అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ వెస్లే సో 14 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.
నార్వే టోర్నీలో కార్ల్సన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. అయిదు సార్లు ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ కేవలం 9 పాయింట్లే సాధించాడు. తర్వాత జరిగే రెండు క్లాసికల్ గేమ్స్‌లో అతను గెలిచినా.. పాయింట్ల విషయంలో అతను నెట్టుకురావడం కష్టమే. ఇక ప్రజ్ఞానంద చేతిలో మొత్తానికి మూడు సార్లు కార్ల్సన్ ఓడారు.