India | ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీ: ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత సైక్లిస్టులు పతక దూకుడు కనబరుస్తున్నారు. బుధవారం జరిగిన మహిళల జూనియర్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు స్వర్ణం దక్కింది.
సరితా కుమారి, నియా సెబాస్టియన్, జైనా మహమ్మద్‌తో కూడిన భారత త్రయం 53.383సెకన్ల టైమింగ్‌తో పసిడి ఖాతాలో వేసుకుంది. మరోవైపు పారా టీమ్ స్ప్రింట్ ఈవెంట్ అర్షద్ షేఖ్, జలాలుద్దీన్ అన్సారీ, బసవరాజ్‌తో కూడిన బృందం రజతం దక్కించుకుంది.