హైదరాబాద్, ఆట ప్రతినిధి: థాయ్‌లాండ్‌లోని ఫిచిట్ నగరం వేదికగా జరుగుతున్న ఆసియా రోడ్ పారా సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత పారాసైక్లిస్టుల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పోటీలకు రెండో రోజైన శనివారం భారత్‌కు స్వర్ణం సహా రెండు రజతాలు, కాంస్యం దక్కాయి. మహిళల సీ2 రోడ్ రేసు ఈవెంట్లో మహారాష్ట్రకు చెందిన జ్యోతి గదేరియా పసిడి పతకంతో మెరిసింది. మరోవైపు పురుషుల హెచ్4 హ్యాండ్ సైక్లింగ్ ఈవెంట్లో ప్రశాంత్ అర్కల్ (మహారాష్ట్ర) రజతం దక్కించుకున్నాడు. పురుషుల సీ2 రోడ్ రేసు ఈవెంట్లో అర్షద్ షేక్(ఆంధ్రప్రదేశ్)కు రజతం, పురుషుల సీ2 ఈవెంట్లో జలాలుద్దీన్ అంసారీ(బీహార్) కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. కృషి, పట్టుదలతో పారా సైక్టిస్టులు సాధిస్తున్న విజయా లు ఎందరికో స్ఫూర్తి దాయకమని ఆదిత్య మె హతా ఫౌండేషన్ పేర్కొంది. లాస్ఎంజి ల్(2028) పారా ఒలింపిక్స్ లక్ష్యంగా అథ్లెట్లు తమ సాధన కొనసాగిస్తున్నారని తెలిపింది.