Champions Trophy | హలన్బుయిర్ (చైనా): ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ హాకీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్‌లో 3-0తో చైనాను చిత్తుచేసిన భారత్.. సోమవారం 5-1తో జపాన్‌పై జయభేరి మోగించింది. భారత్ తరఫున సుఖ్జీత్ సింగ్ 2, 60వ నిమిషాలలో రెండు గోల్స్ సాధించగా అభిషేక్ (3), సంజయ్ (17), ఉత్తమ్ సింగ్ (54) తలా ఓ గోల్స్ చేశారు.
జపాన్ నుంచి మత్సుమొటో కజుమస ఒక్కడే 41వ నిమిషంలో గోల్ కొట్టగలిగాడు. మ్యాచ్ ఆరంభం నుంచే అదరగొట్టిన భారత్.. జపాన్‌పై విజయంతో సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. ఆరు జట్లు తలపడుతున్న ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.