Hockey India | హలన్బుయిర్ (చైనా): ఏషియన్ చాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత్ విజయ పరంపర దిగ్విజయంగా కొనసాగుతోంది. లీగ్ దశలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలిచిన మెన్ ఇన్ బ్లూ.. గురువారం జరిగిన మ్యాచ్‌లో 3-1తో దక్షిణ కొరియాను ఓడించింది. అరేజిత్ సింగ్ (8వ నిమిషంలో) తొలి క్వార్టర్‌లోనే గోల్ చేయగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 9, 43వ నిమిషాలలో రెండు గోల్స్ సాధించాడు. సౌత్ కొరియా నుంచి యంగ్ జిహున్ ఒక్కడే 30వ నిమిషంలో గోల్ చేశాడు.