ఉలన్బాతర్ (మంగోలియా) : భారత యువ బాక్సర్లు మీనాక్షి హుడా, జైస్మీన్ లంబొరియా ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. మంగళవారం ఇక్కడ జరిగిన సెమీస్ బౌట్లలో ఈ ఇద్దరూ జోరును కొనసాగిస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసి పసిడి పోరుకు అర్హత సాధించగా మెన్స్ క్యాటగిరీలోనూ విశ్వనాథ్ సురేశ్, సచిన్ సివాచ్ కూడా ఫైనల్ చేరారు. మహిళల 48 కిలలో సెమీస్‌లో మీనాక్షి.. 4-1తో తిప్సచ యొద్వరీ (థాయ్‌లాండ్)ని ఓడించగా జైస్మీన్ (57 కి.) 3-2తో నిగిన ఉక్తమొవ (ఉజ్బెకిస్థాన్)పై పోరాడి గెలిచింది.
పురుషుల 60 కి. సెమీస్‌లో సచిన్.. 4-1తో సక్ద రౌమ్తమ్ (థాయ్‌లాండ్)ను చిత్తు చేయగా విశ్వనాథ్ (50 కి.) వరల్డ్ చాంపియన్, ప్రపంచ మొదటి ర్యాంకర్ అయిన కజకిస్థాన్ బాక్సర్ తష్కెంబెపై 5-0తో ఏకపక్ష విజయాన్ని నమోదుచేశాడు. తాజా ప్రదర్శనలతో ఈ టోర్నీలో ఫైనల్ చేరిన బాక్సర్ల సంఖ్య 8 (ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు)కు చేరింది. ఇదిలాఉండగా ఆకాశ్ (75 కి.), లోకేశ్ (85 కి.), నరేందర్ (90+ కి.), హర్ష్ చౌదరి (90 కి.) సెమీస్ బౌట్లలో ఓడి కాంస్య పతకంతో సంతృప్తి పడ్డారు.