Asia Cup Heroes : ఆసియా కప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు ట్రోఫీ లేకుండానే స్వదేశం వస్తోంది. మెగా టోర్నీ ముగియడంతోటీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా స్వదేశం చేరుకుంటున్నారు. ఫైనల్లో సూపర్ బ్యాటింగ్‌తో పాకిస్థాన్‌కు దడ పుట్టించిన తిలక్ వర్మ (Tilak Varma) సోమవారం రాత్రి హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. ఈ మెగా టోర్నీలో జట్టును గొప్పగా నడిపించిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)లు ముంబైలో దిగారు. దాంతో, విమానాశ్రయంలో ఈ స్టార్ ఆటగాళ్లకు హారతిచ్చి, నుదుటన తిలకం పెట్టి.. ఘన స్వాగతం పలికారు అభిమానులు.
ఆసియా కప్‌లో తన మ్యాచ్ ఫీజును పహల్గాం ఉగ్రదాడి బాధితులకు, భారత సైనికులకు ఇస్తానని ప్రకటించిన సూర్యకుమార్ యాదవ్‌ను చూడగానే.. ‘భారత్ మాతాకీ జై’, ‘జయహో టీమిండియా’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మరికొందరు వీళ్లను తమ ఫోన్లలో ఫొటోలు తీస్తూ మురిసిపోయారు. అయితే.. భద్రతా సిబ్బంది త్వరగా సూర్య, పాండ్యాను కారు ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారు.
A GRAND WELCOME OF CAPTAIN SURYAKUMAR YADAV IN MUMBAI. 🇮🇳pic.twitter.com/ni56BytJka
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 30, 2025
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన ఆసియా కప్‌లో భారత్ అజేయంగా విజేతగా నిలిచింది. లీగ్ దశలో, సూపర్ -4లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఫైనల్లోనూ దాయాదిని మట్టికరిపించింది. 147 పరుగుల ఛేదనలో ఆరంభంలోనే మూడు వికెట్లు పడినా తిలక్ వర్మ (69 నాటౌట్) చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.
𝙁𝙚𝙖𝙧𝙡𝙚𝙨𝙨 𝘾𝙧𝙞𝙘𝙠𝙚𝙩 & 𝙋𝙚𝙧𝙛𝙤𝙧𝙢𝙖𝙣𝙘𝙚 👊
Hardik Pandya reflects on #TeamIndia‘s stellar performance in the #AsiaCup2025 and on his role in the team with the bat and ball 👌 – By @Moulinparikh#Final | @hardikpandya7 | Watch 🔽
— BCCI (@BCCI) September 29, 2025
సంజూ శాంసన్(24, శివం దూబే(33)ల సహకారంతో పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తిలక్.. టీమిండియా తొమ్మిదోసారి ఆసియా కప్ విజేతగా నిలిచేలా చేశాడు. ఈ మెగా టోర్నీలో కెప్టెన్ సూర్య బ్యాటింగ్‌లో విఫలమైనా కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. మరోవైపు పాండ్యా సైతం బ్యాటుతో, బంతితో రాణించాడు. గాయం కారణంగా ఫైనల్ ఆడలేకపోయిన ఆ ఆల్‌రౌండర్ మ్యాచ్ పూర్తయ్యాక.. తనదైన స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు.