Asia Cup | ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్‌పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓ షోలో జరిగిన చర్చలో అక్తర్ పాల్గొన్నాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. భారత జట్టును పాకిస్తాన్‌ను అధిగమిస్తుందనే విషయం చాలా స్పష్టంగా ఉందని.. ఘోరంగా ఓడించాలని చూస్తారు.. ఇది చాలా సులభమేనని వ్యాఖ్యానించాడు.
టీమిండియా ఫైనల్లో పాక్‌తో కాకుండా ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడాలని కోరుకుంటుందని పేర్కొన్నాడు. చర్చ సందర్భంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ భారత జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఇన్సింగ్స్‌ను తీర్చిదిద్దగల విరాట్ కోహ్లీ లేడని తెలిపాడు. భారత్‌కు మంచి ఆరంభం లభించకపోతే.. తొలి రెండు వికెట్లు వేగంగా కోల్పోతే పాకిస్తాన్‌కు అవకాశం ఉందని తెలిపాడు. విరాట్ కోహ్లీ లేడని.. బ్యాటింగ్ భిన్నంగా ఉంటుందని.. పాక్ కొత్త బౌలర్లను టీమిండియా బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆడలేదని.. బౌలర్లు ఒత్తిడి తెస్తే పాక్ గెలిచే అవకాశం ఉంటుందని మిస్బా తెలిపాడు. మిస్బా అభిప్రాయంతో అక్తర్ విభేదించాడు.
భారత మిడిలార్డ్ ఎంతో బలంగా ఉందో చెప్పాడు. ‘నేను నీ వాదనలను వ్యతిరేకించడం లేదు. కానీ, టీమిండియాకు రింకు సింగ్, సంజు శాంసన్, శుభ్‌మాన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, జితేష్ శర్మ జట్టులో ఉన్నారు. అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ చేయగలడు. రెండు వికెట్లు పడిపోయినంత మాత్రాన కుప్పకూలే జట్టు ఇది కాదు. ఇది విరాట్ కాలం నాటి జట్టు కాదు. వారిని సులభంగా అవుట్ చేయడం సులభం కాదు. వారికి అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు’ అంటూ అక్తర్ తెలిపాడు. భారత జట్టు మిడిలార్డర్ బలంగా ఉందని స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు వరకు చూడని భారత జట్టు బలమైన మిడిలార్డర్ బ్యాటింగ్ లైనప్ అని తెలిపాడు. గత ఐదు మ్యాచుల్లో పాకిస్తాన్‌ను భారత్ ఓడించిందని గమనించాలని సూచించాడు.