Asia Cup 2023 | ఆసియా కప్-2023 ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ వేదికగా పాక్, శ్రీలంక దేశాల్లో జరుగనున్నది. టోర్నీలోని ఆరుజట్లు పాల్గొననుండగా.. ఇప్పటి వరకు మూడుదేశాల జట్టును ఆయా క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. ఇంకా భారత్, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్ జట్లను ప్రకటించాల్సి ఉంది. ఆసియా కప్ కోసం నేపాల్ సైతం 17 మందితో జట్టును ప్రకటించింది. జట్టుకు ఆల్ రౌండర్ రోహిత్ పాడెల్ నాయకత్వం వహించనున్నాడు. జట్టులో ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ స్పిన్నర్ సందీప్ లామిచానే చోటు దక్కించుకున్నాడు. నేపాల్ క్రికెట్ అసోసియేషన్ ట్విట్టర్ ద్వారా జట్టు వివరాలు వెల్లడించింది.
నేపాల్ జట్టు పాక్లో వారం రోజుల పాటు జరిగే సన్నాహక శిబిరానికి హాజరవుతుందని, పీసీబీ నియమించిన జట్లతో మ్యాచులు ఆడనున్నట్లు నేపాల్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుండగా.. ఇందులో ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భారత్ సహా ఆరు జట్లు పాల్గొననున్నాయి. భారత్, పాకిస్థాన్లతో పాటు నేపాల్ గ్రూప్-ఏలో చోటు దక్కించుకుంది. సెప్టెంబర్ 4న క్యాండీలో భారత్తో ఆడటానికి ముందు ముందు ముల్తాన్లో పోటీ ప్రారంభ రోజున వారు తమ తొలి మ్యాచ్ను ఆతిథ్య జట్టు పాక్తో ఆడతారు. ఆసియా కప్లో ఇప్పటి వరకు శ్రీలంక ఆరుసార్లు విజేతగా నిలువగా.. నేపాల్ తొలిసారిగా ఆడబోతున్నది.
రోహిత్ పాడెల్ (కెప్టెన్), కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ (వికెట్ కీపర్), భీమ్ షార్కీ, కుశాల్ మల్లా, ఆరిఫ్
షేక్, దీపేంద్ర సింగ్ ఎయిరే, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్ కేసీ, సందీప్ లామిచానే, లలిత్ రాజ్బన్షి, ప్రతిష్ జీసీ ధకల్, సందీప్ జోరా, కిశోర్ మహ్తో, అర్జున్ సౌద్.
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తంజీద్ తమీమ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహీద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహమూద్, షేక్ మహెదీ, నసుమ్ హొఫ్సా, షమీ అహ్మదీన్, షోర్ఫుల్ ఇస్లాం, ఎబాడోత్ హుస్సేన్, మహ్మద్ నయీమ్.
అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, తైబ్ తాహిర్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్ (వైస్-కెప్టెన్), మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, ఫహీమ్ అష్రఫ్, హరీస్ రవూఫ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ అఫ్రిది.