IND vs SRI | ఆసియా కప్ సూపర్-4లో (Asia Cup Super 4) భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. శ్రీలంకపై 41 పరుగుల తేడాతో (India Won) గెలుపొందింది. 214 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 172 పరుగులకే ఆలౌట్ అయింది. ధనంజయ డిసిల్వా 41, దునిల్ వెల్లలాగే 42 పరుగులు చేశారు. టీం ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, బుమ్రా, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు, సిరాజ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వరుసగా మూడో మ్యాచ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకోగా.. గత మ్యాచ్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్ (39) రాణించాడు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగె 5, చరిత అసలెంక 4 వికెట్లు పడగొట్టారు.
అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమాలోని అలుమా డోలుమా (Aluma doluma) పాటను డీజే నిర్వాహకులు ప్లే చేశారు. దీంతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ఇటు ఇండియన్ ఫ్యాన్స్‌తో పాటు.. అటు శ్రీలంక తమిళ ఫ్యాన్స్ ఈ పాటను బాగా ఎంజాయ్ చేశారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Aluma doluma craze never ends🔥🔥🎊 #INDvsSL #VidaaMuyarchi #AjithKumar pic.twitter.com/tFg99UXnBz
— 𝑀𝓸𝒽𝒶𝓃🥀 (@Mohan66629479) September 12, 2023
వేదాళం సినిమా 2015లో విడుదలై సూపర్ డూపర్ హిట్టయింది. అజిత్ నటనకు తమిళ తంబీలు వెర్రెత్తిపోయారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అయితే ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో కొన్ని నెలల తర్వాత తెలుగులో ఆవేశం పేరుతో డబ్ చేసి రిలీజ్‌కు రెడీ చేశారు. ఇక అనిరుధ్ స్వరపరిచిన అలుమా డోలుమా సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది.