IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌కు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు స్టార్ ఆటగాళ్లు ఏళ్లుగా ఆడుతున్న ఫ్రాంచైజీలను వీడేందుకు సిద్ధమవుతున్నారు, సంజూ శాంసన్ (Sanju Samson) ఇప్పటికే తనను వదిలేయాలని రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) యాజమాన్యానికి స్పష్టం చేయగా.. రవించంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) సైతం ఇదే ఆలోచనతో ఉన్నాడు. వచ్చే సీజన్‌కు తనను కొనసాగిస్తారా?.. వదిలేస్తారా? అనేది చెప్పాలని చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను కోరాడీ స్పిన్ దిగ్గజం.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్.. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలు విషయాలపై స్పందిస్తుంటాడు. అతడు ఈసారి తన ఐపీఎల్ భవితవ్యం గురించి అభిమానులకు అప్డేట్ ఇస్తున్నాడు. వచ్చే సీజన్లో జట్టు మారాలని అనుకుంటున్న యశ్.. ఇదే విషయాన్ని చెన్నై యాజమాన్యానికి తెలియజేశాడు. నాకు సీఎస్కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. నేను చెన్నైతో చేరిన మొదటి ఏడాది (2009) సీఈఓ ఒక ఈమెయిల్ ద్వారా నా ప్రదర్శనను వివరించాడు. నువ్వు గొప్పగా రాణించావు. మాకు కావాల్సింది ఇదే. అందుకే వచ్చే ఏడాది నీ కాంట్రాక్ట్ పొడిగిస్తున్నాం. చెన్నై మేనేజ్మెంట్ ప్రతిసారి ఇదే ఫార్ములా పాటిస్తుంది.
R Ashwin has told CSK that he doesn’t mind parting ways with them if he doesn’t fit their plans, ESPNcricinfo has learnt
Read more 👉 https://t.co/P2l8I3nNeH pic.twitter.com/5Du6VBRWg6
— ESPNcricinfo (@ESPNcricinfo) August 11, 2025
ఒక ఆటగాడికి ఫ్రాంఛైజీతో కొనసాగాలా? వేరే జట్టుకు మారాలా? అనేది నిర్ణయించుకునే హక్కు ఉంది. ఫ్రాంచైజీ యాజమాన్యం కూడా అట్టిపెట్టుకుంటున్నాం.. వదిలేస్తున్నాం అనేది తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సంజూ, నా విషయంలో జరుగుతోంది ఇదే అని అశ్విన్ వెల్లడించాడు. గతంలో ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆడేందుకు ఈ వెటరన్ స్పిన్నర్ ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. సీఎస్కేకు మారడనికి ముందు అశ్విన్ మూడేళ్లు రాజస్థాన్‌కు ఆడాడు. అయితే.. పద్దెనిమిదో సీజన్ మెగా వేలంలో ఈ స్పిన్ మాంత్రికుడిని చెన్నై రూ.9.75 కోట్లు వెచ్చించి కొన్నది. ఒకవేళ ట్రేడ్ డీల్ కుదిరితే శాంసన్ సీఎస్కేకు.. అశ్విన్ రాజస్థాన్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
Ashwin, Samson, Root & Riyan in the new Rajasthan Royals Jersey 🔥💪🏻#RajasthanRoyals #IPL2023 #TATAIPL #insidesports #crickettwitter pic.twitter.com/ASvclWr3KP
— InsideSport (@InsideSportIND) March 26, 2023
అశ్విన్ ఐపీఎల్ కెరీర్ సీఎస్కేతోనే మొదలైంది. ఆ తర్వాత.. రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, కింగ్స్ ఆఫ్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ఆడిన యశ్..2025 ఎడిషన్‌లో మళ్లీ చెన్నై గూటికి చేరాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన అశ్విన్ ఈ మెగా టోర్నీలో అదరగొట్టాడు. ఐదో అత్యధిక వికెట్లు వీరుడుగా రికార్డు నెలకొల్పాడు. 221 మ్యాచుల్లో 30.22 సగటుతో 187 వికెట్లు పడగొట్టాడీ తమిళ తంబీ.